google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అమలు చర్యలు చేపడుతున్నారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను గుర్తించి ఈ-చలాన్లు విధించడంతో పాటు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.అతివేగం, తప్పు దారిలో ప్రయాణించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.