google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని క్లబ్ రోడ్డులో గల, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. పలువురు చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 30 వేల కేంద్రాలలో, సుమారు 50 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జరుగుతోందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు అర్బన్ పరిధిలో 4,067 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొర్రపాటి అనూష, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ ఊర్మిళాదేవి, డాక్టర్ బ్యులాగ్రేస్, ఏఎన్ఎం ఇంటూరి పద్మావతి, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కొచ్చెర్ల శ్రీను, కాకుమాని మాల్యాద్రి, సీనియర్ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, అన్న క్యాంటీన్ చైర్మన్ కొండలరావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, పార్టీ నాయకులు జియావుద్దీన్, మూసా, జయకృష్ణ, పలువురు నేతలు పాల్గొన్నారు.