google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు రాత్రి నిర్వహించిన శేష వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదిశేషునిపై స్వామివారు దివ్య అలంకారంలో దర్శనమివ్వగా, భక్తులు గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.శేష వాహనం భక్తి, జ్ఞానం మరియు దైవ రక్షణకు ప్రతీకగా భావిస్తారు. శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై శయనించే రూపాన్ని స్మరింపజేసే ఈ సేవ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత, శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.విద్యుద్దీపాల అలంకరణల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందారు.
(జూన్ 28, ఆదివారం) బ్రహ్మోత్సవాల ఐదవ రోజు కార్యక్రమాలు:
ఉదయం: గరుడ వాహన సేవ
రాత్రి: గజ వాహన సేవ
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా ఆలయ అధికారులు కోరారు.