google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 85 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)” కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుదిక్కుల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల వ్రాతపూర్వక వినతులను జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, భాధితులకు న్యాయం అందించాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారిలో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో లేదా నడవలేని స్థితిలో ఉన్నవారు కూడా ఉంటారని, అటువంటి వారికి ప్రత్యేక శ్రద్ధ చూపి, మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను పూర్తిగా విని, సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ గారు సూచించారు.జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు, చీటింగ్ మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ డి.ప్రసాద్, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, కందుకూరు సీఐ అన్వర్ బాష, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై లు జనార్దన్ రావు, యాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
