google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ :-
పదవ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు, ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పామూరు ‘మల్లికార్జున్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ అధినేత డాక్టర్ పొలిమేర మల్లికార్జున్ రెడ్డి (PMR) ఘనంగా అభినందించారు.ఆర్థిక సహాయం అందజేత:
వేపగుంపల్లి గ్రామానికి చెందిన మన్నే కార్తీక్, పెద్ద ఇర్లపాడు గ్రామానికి చెందిన ఉప్పలపాటి భవ్యంజలి ప్రతిభను గుర్తించిన ఆయన, విద్యార్థులకు ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో గొప్ప ఆశయాలతో ముందుకు సాగాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని ఆకాంక్షించారు.పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ కలవకూరి వెంకటేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కోమటికుంట్ల శివ, జనరల్ సెక్రటరీ మనోజ్, కనిగిరి కన్వీనర్ నవీన్, కో-కన్వీనర్ సురేంద్ర మరియు స్థానికులు పాల్గొన్నారు.