google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

సూర్య బార్ & రెస్టారెంట్ పాతికేళ్ల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో సూర్య బార్ అండ్ రెస్టారెంట్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మంగళవారం వేడుకలు నిర్వహించారు. రెస్టారెంట్ నిర్వాహకులు, పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు ఆహ్వానంతో. శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేశారు. పాతికేళ్లుగా నాణ్యత, శుభ్రతను పాటిస్తూ, సూర్య రెస్టారెంట్ అనేకమంది నమ్మకాన్ని పొందిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ఇన్ని సంవత్సరాలపాటు ఒకే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, నిర్వాహకులు పిడికిటి వెంకటేశ్వర్లు, సిబ్బందికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెస్టారెంట్ సిబ్బందికి కొత్త బట్టలు అందించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఎస్పి బాలసుబ్రమణ్యం, పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, నియోజకవర్గ బిజెపి అధ్యక్షుడు ఘట్టమనేని హరిబాబు, వేముల సుకుమార్, పలువురు టిడిపి నాయకులు, వివిధ వర్గాల ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు.