google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అనే నినాదంతో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో బుధవారం సొసైటీ సభ్యుల సహకారంతో కందుకూరు పట్టణం బ్రృందావనం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకములు,పలకలు, పెన్సిల్స్ పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు సేవారత్న రవ్వా శ్రీనివాసులు (ఎల్ ఐ సి & స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఎన్నో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారికి అవసరమైన విద్యాసామాగ్రిని మా సంస్థ ద్వారా అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నామని,ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజనం, యూనిఫామ్,బ్యాగులు, పుస్తకములు తదితర వస్తువులు అందజేయటం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఈ.సి.మెంబర్లు మోదడుగు శ్రీనివాసరావు, చిన్ని వెంకట నాగసాయి పూర్ణ తేజ, పబ్బశెట్టి పవన్ కుమార్,ఉపాధ్యాయులు ఇందిరా రాణి,స్వప్న గార్లు పాల్గొన్నారు.