google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 05 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక పోలీసు బృందాలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి మరియు టాస్క్ ఫోర్స్ మరియు సిసిఎస్ సిబ్బంది దాడి కలసి ది 30.06.2026 సాయంత్రం వి.వి పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోకూరు గ్రామ పొలాల్లో అక్రమంగా కోతముక్క పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్లు 2మోటర్ సైకిల్ RS 1,37,740/- నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని వీవీ పాలెం పోలీస్ స్టేషన్ లో అప్పగించడం అయినది.జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.