google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు మరియు ప్రజలకు శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యతను వివరించి, వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా వేగంగా పోలీసుల సహాయం ఎలా పొందవచ్చో వివరించారు.అదేవిధంగా చిన్నారులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, వ్యక్తిగత భద్రత, అపరిచితుల పట్ల అప్రమత్తత, అనుచిత ప్రవర్తన ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.మహిళలపై నేరాల నివారణ, చిన్నారుల రక్షణ మరియు సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పోలీసులు తెలిపారు.