google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ గారు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ దరఖాస్తులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట కాలవ్యవధిలో సమర్థవంతంగా పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (Public Grievance Redressal System) ను మరింత బలోపేతం చేయడం, ప్రతి పౌరుడికి వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడం, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల భావన (Positive Public Perception) పెంపొందించడం పరిపాలనలో అత్యంత ప్రాధాన్య అంశాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులను సత్వరంగా స్వీకరించి పరిష్కరించేందుకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ సేవలకు సంబంధించిన ఏ విధమైన ఫిర్యాదు, సమస్య లేదా సూచన ఉన్నా ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించడంతో పాటు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1800 425 2381కు కాల్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని తెలిపారు.