google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
మెకానిక్ డే సందర్భంగా టంగుటూరు టూ వీలర్ బైక్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మెకానిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా స్థానిక ట్రంక్ రోడ్ లో భారీ బైక్ ర్యాలీ జరిగింది. తదనంతరం బచ్చు రామారావు మేస్త్రి కాంప్లెక్స్ నందు సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు (ఎఫ్ సి ఓ పి) టంగుటూరి వెంకటేశ్వర్లు సభాధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బచ్చు రామారావు, గౌరవ సలహాదారులు ఎస్కే కాసిం, అసోసియేషన్ అధ్యక్షులు కసుకుర్తి శివకుమార్, ఉపాధ్యక్షులు బ్రాహ్మణకాక వేణు, ప్రధాన కార్యదర్శి బచ్చు సారధి, జాయింట్ సెక్రెటరీ లామ్ వినోద్, ట్రెజరర్ గొల్లపూడి ప్రసాద్ మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు, సాధారణ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.