google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ, ఈ నెల జూలై 11, 2026,శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన వివాదాలు, రాజీ ద్వారా పరిష్కరించదగిన ఇతర కేసులను వేగంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై ఇచ్చే అవార్డు తుది తీర్పుతో సమానమైన చట్టబద్ధత కలిగి ఉంటుందని, దానిపై అప్పీల్ ఉండదని పేర్కొన్నారు. అంతేకాక, కోర్టు ఫీజు చెల్లించిన కేసుల్లో నిబంధనల ప్రకారం కోర్టు ఫీజు తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.కక్షిదారులు, న్యాయవాదులు తమకు రాజీకి అనుకూలమైన కేసులను గుర్తించి సంబంధిత కోర్టు ద్వారా లోక్ అదాలత్‌కు పంపించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరాయకొండ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి తెలియజేశారు.