
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
MRPS 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న MRPS పురిటిగడ్డ ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవాన్ని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నామని MRPS ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరాయకొండ మండల నాయకత్వం తెలిపారు.ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి సింగరాయకొండ మండలంలో సుందర్ నగర్ లో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు.మాదిగల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈదుమూడిలో నిర్మించబడుతున్న మాదిగల పుణ్యక్షేత్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రంలో మాదిగ జాతి మూలపురుషుడు ఆది జాంబవంతుడు విగ్రహం, అరుంధతి దేవి విగ్రహం, అలాగే ఎస్సీ వర్గీకరణ సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన మాదిగ అమరవీరుల స్మారక స్థూపం నిర్మించబడనున్నట్లు తెలిపారు.జూలై 7న జరిగే శంకుస్థాపన మహోత్సవానికి సింగరాయకొండ మండలం నుంచి మాదిగ జాతి బిడ్డలు, MRPS నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరాయకొండ మండల నాయకత్వం పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి పొనుగోటి లాజర్ మాదిగ, కో - కన్వీనర్లు పొనుగోటి ఉదయ్ కుమార్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, పొనుగోటి ప్రకాష్ మాదిగ, చేవూరి కోటి, తాటిపర్తి ప్రణయ్, తమ్ములూరి కోటయ్య, పొనుగోటి సుబ్బారావు, పొనుగోటి అశోక్, చేవూరి శ్రీహరి, కురుగుంట్ల బన్నీ, రితదితరులు పాల్గొన్నారు.