
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ మరియు ఇతర చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నారు.హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, సీటుబెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, అతివేగం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.