
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండల అభివృద్ధి అధికారి (MPDO) జయమణి గారు శనివారం ఉదయం హఠాన్మరణం చెందారు.తెలిసిన వివరాల ప్రకారం, నిద్రలో ఉండగానే గుండెపోటుకు గురై ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే మండల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు.విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ మండల అభివృద్ధికి సేవలందించిన జయమణి గారి ఆకస్మిక మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని పలువురు ప్రార్థించారు.