
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
400 పైగా పొగాకు బేళ్లను వేలంకు తీసుకురాగా కేవలం 20 పొగాకుబేళ్లను కొనుగోలు చేయడంతో వేలాన్ని ఆపి బయటకు వచ్చిన రైతులు…అనంతరం గిట్టుబాటు ధర కల్పించాలని ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన పొగాకు రైతులు…సమాచారం తెలుసుకున్న సిఐ రాజేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పి రాస్తారోకో ను విరమింప చేశారు…రోడ్డుపై రైతులు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది…