
తొలి శుభోదయం న్యూస్ కావలి:-
విద్యార్థి స్థాయిలోనే రక్తదానం పట్ల అవగాహన పెంచేందుకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కావలి రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు.సోమవారం శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి కల్యాణమండపంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాల సందర్బంగా జూనియర్ రెడ్ క్రాస్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక పోటీలను రక్తదాన ప్రక్రియ పితామహులు కార్ల్ లాండ్ స్టెనర్ చిత్రపటానికి పుష్పమాల సమర్పించి, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, గొట్టిపాటి మాలినిదేవి దంపతులు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థాన చైర్మన్ బచ్చు వీరాస్వామి, రోటరీ క్లబ్ అధ్యక్షలు సురేష్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, సోమవారం నుండి శనివారం వరకు"రక్తదానం- ఆవశ్యకత" అనే అంశంపై లలిత సంగీతం, బృందగానం,నృత్యం, బృందనృత్యం, వ్యాసరచన, లఘునాటిక విభాగాలలో పోటీలు జరుగుతాయని అన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాన మాసోత్సవాలు -2026 ముగింపు సభ, రక్తదాతలకు అవార్డులు, సాంస్కృతిక పోటీ విజేతలకు బహుమతి ప్రధానం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్, వైస్ చైర్మన్ కె హరినారప రెడ్డి, పాలకమండలి సభ్యులు అనికేపల్లి రమేష్ రెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, కలికి శ్రీహరి రెడ్డి, జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ జి హరనాథ్, తలసేమియా డే కేర్ సెంటర్ శాశ్వతదాత రమణారెడ్డి, ప్రముఖ రక్తదాత తానికొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం జరిగిన లలితసంగీత పోటీలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనగా, ప్రముఖ గాయకులు రామచంద్ర రావు, విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బరాయ శర్మ, కళ్యాణి న్యాయ నిర్నెతలుగా వ్యవహారించారు.