
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో, దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల “సమగ్ర శిక్ష” పరిధిలోని భవిత సెంటర్లలో చదువుతున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు రూ.10 లక్షల విలువైన సహాయక పరికరాలను దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.
అందజేసిన పరికరాలు:
🔹 బ్యాటరీ సైకిళ్లు – 2
🔹 వీల్చైర్లు – 5
🔹 వినికిడి యంత్రాలు – 7
🔹 MR కిట్లు – 10
🔹 బ్రెయిలీ కిట్ – 1
అనంతరం విభిన్న ప్రతిభావంతులకు హెల్మెట్లను కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఎంఈఓ-2 రామాదేవి, టిడిపి నాయకులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, కూటమి శ్రేణులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.