
డి ఎన్ ఎ పరీక్షలో తేలింది.
తల్లి దండ్రులకు సమాచారం పంపాము వారు వస్తె మృత దేహాన్ని అప్పగిస్తాం.
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు వెల్లడి.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
అనుమానాస్పద స్థితిలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి మల్లె తోట బావిలో లభించిన మృత దేహం జగిత్యాల జిల్లా కోరుట్ల కి చెందిన అంకం రాహుల్ దే అని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు వెల్లడించారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 69/ 2026 తో నమోదయిన కేసు రికన్స్ట్రక్షన్ లో భాగంగా ఆయన మంగళవారం సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి మనస్థాపానికి గురయి ఇంటినుండి మే నెల 27 న శబరి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి వచ్చాడు. అయితే సింగరాయకొండ రైల్వే వద్ద శబరి ఎక్స్ ప్రెస్ లో సింగరాయకొండ రైలు వరకు ప్రయాణం చేసి సింగరాయకొండ లో రైలు దిగి నడక మార్గం లో పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి మల్లెతోట లోని బొడ్డు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సమాచారం పోలీస్ కి చేరడం తో ముందుగా గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీస్ దర్యాప్త చేపట్టారు.అయితే మృతి దేహం ఎవరిదీ అన్న ప్రశ్న ఇంతకాలం పోలీస్ కి సవాలుగా ఈ కేసులో చిక్కుముడి వీడిందు. మృతుడి డి ఎన్ ఏ తో సరి పోవడంతో సింగరకొండ పోలీస్ లు రాహుల్ తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వడం జరిగిందనీ వారు వచ్చి మృతదే క్లెయిమ్ చేస్తే నిబంధనల ప్రకారం మృత దేహానికి వెలికి తీసి పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందని ఎస్పీ హర్షవర్ధన రాజు మీడియాకి వివరించారు. ఈ కేసు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణ లో ఉందని విచారణ పూర్తి కాగానే తదుపరి చర్యలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ కేసులో ప్రతి చిన్న విషయాన్ని పరిగణన లోకి తీసుకుని సింగరాయకొండ పోలీస్ అధికారులు, సిబ్బంది ఒంగోలు డి ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణ లో కృషి చేశారని ఆయన వివరించారు.డి ఎన్ ఎ పరీక్ష నివేదిక రావడం, మృతుడి డి ఎన్ ఎ అతడి తండ్రి డి ఎన్ ఎ తో సరి పోవడం తో తదుపరి విచారణ లో భాగంగా మంగళ వారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కేసు రీ కన్స్ట్రక్షన్ లో భాగంగా వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.