
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల క్రితం పాత సింగరాయకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీప బావిలో లభించిన అంకం రాహుల్ (21) మృతదేహం కేసు ఘటన స్థలాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పరిశీలించారు.ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, కేసును శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరితగతిన ఛేదించాలని అధికారులను ఆదేశించారు.డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహం అంకం రాహుల్‌దేనని నిర్ధారణ అయినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.అనంతరం సింగరాయకొండ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ, నమోదైన కేసుల పురోగతిని సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఎన్‌హెచ్-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డుపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, అండర్‌పాస్‌లు వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.