
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు, స్వచ్ఛంద సంస్థల (NGOs) ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే నేరాల నివారణ, శక్తి యాప్ వినియోగం, సైబర్ మోసాల నుంచి రక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల నివారణ, అలాగే మహిళల రక్షణకు అమలులో ఉన్న చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించారు.మహిళలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ను వినియోగించి తక్షణ సహాయం పొందవచ్చని వివరించారు. ఆన్లైన్లో అపరిచితుల లింకులు, OTPలు, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, మహిళలపై వేధింపులు, హింస, మోసాలపై వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కదలికలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ, మహిళలు మరియు పిల్లలకు సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొన్నారు.