
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జూలై 11, 12న పట్టణంలోని స్వర్ణ ప్యాలస్ లో సిపిఐ జిల్లా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు తెలిపారు. స్థానిక కోటారెడ్డి భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సామాజిక సాంస్కృతి రంగాలలో జరుగుతున్న మార్పులపై సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా వ్యాప్తంగా కౌన్సిల్ సభ్యులకు సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా తరగతులు రెండు రోజుల పాటు నిర్వహించటం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హాజరవుతారని ఆయన అన్నారు. వారితో పాటు అనుభవం కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసులు, డాక్టర్ సీఎన్ క్షేత్ర పాల్ రెడ్డి, డి.సాగర్, డి. జమీందార్, ఎం. వెంకయ్యలు తో సిపిఐ కార్యకర్తలు, కౌన్సిల్ సభ్యులకు శిక్షణా బోధన నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లా నలుమూలల నుండి సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొని శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై.ఆనందమోహన్, లక్ష్మీనారాయణ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.