
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా బస్సులకు సంబంధించిన అన్ని అవసరమైన పత్రాలు, డ్రైవర్‌కు సంబంధించిన లైసెన్స్ మరియు ఇతర వివరాలు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు (Emergency Exits), ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించి, రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని విద్యాసంస్థలు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.