
తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-
పొన్నలూరు మండలం, ముప్పాళ్ళ గ్రామ నాయకులు శ్రీ కూనం బ్రహ్మానంద రెడ్డి గారి తండ్రి శ్రీ కూనం సుబ్బారెడ్డి గారు కిమ్స్ హాస్పిటల్స్, ఒంగోలు నందు అనారోగ్యంతో చికిత్స పొందుచున్న విషయం తెలియగా… హాస్పటల్ నందు వారిని కలసి వారి మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి స్థానిక డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూ… వారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం నింపిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య .