
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఏఎన్ఎంలు (ANMs), ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మహిళలపై నేరాల నివారణ, పోక్సో (POCSO) చట్టం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళల భద్రత, బాలలపై నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ మోసాలు మరియు ఆన్లైన్ నేరాల నుంచి రక్షణ, మాదకద్రవ్యాలు (గంజాయి/డ్రగ్స్) వల్ల కలిగే దుష్పరిణామాలు, రోడ్డు భద్రత మరియు ఇతర నేరాల నివారణపై సమగ్ర అవగాహన కల్పించారు.విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై లక్ష్యంతో కూడిన విద్య (Aim-Based Education) యొక్క ప్రాముఖ్యత, మంచి నడవడి, క్రమశిక్షణ, చట్టాల పట్ల గౌరవం మరియు బాధ్యతాయుతమైన జీవన విధానం గురించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. సోషల్ మీడియా మరియు డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచితుల సందేశాలు, లింకులు, ఓటీపీలు లేదా వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.అలాగే బాలికలు, మహిళలు ఏదైనా వేధింపులు లేదా అనుచిత ప్రవర్తన ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. సమాజంలో మహిళలు, బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొన్నారు.