
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దక్షిణ సింహాచలం పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయ వంతంగా ముగిసిన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శనివారం రాత్రి దేవాలయ ప్రాంగణం లో
ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన మోత కాపులను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి ఆలయ ప్రాంగణం లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు మోత కాపుల సేవలను అభినందించారు. ఘన సత్కారం తో పాటుగా 10 రోజుకు స్వామి వారి బ్రహ్మోత్సవాల లో స్వామి వారి ఉత్సవాల లో సేవలు అందించిన మోత కాపులకు ఆచారం ప్రకారం చెల్లించాల్సిన చెక్కును అందజేశారు.