google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
పాకల రోడ్డులోని న్యూ లైఫ్ ఆరాధన మందిరంలో న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజ సేవలో విశిష్ట కృషి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ జాయింట్ సెక్రటరీగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన యు. ఎలియాజరు ని శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు డాక్టర్ సుదర్శన్ బాబు మాట్లాడుతూ, సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తులను గౌరవించడం గొప్ప సంప్రదాయమని, యు. ఏలియాజరు గారి సేవలు సమాజానికి, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.అదే కార్యక్రమంలో న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా సహకారంతో జూలై నెల కారుణ్య సేవా కార్యక్రమాన్ని నిర్వహించి వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగులు, అంగవైకల్యం కలిగిన వారు, అనాథలకు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు, ప్రోత్సాహక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ఎస్తేర్ ప్రభుదాస్, అమృత సుదర్శన్, న్యూ లైఫ్ కారుణ్య పరిచర్య బృంద సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.అనంతరం సంఘ పెద్దలు పెదకోటయ్య, బాలకోటయ్య, కేజీయా రాణి, మల్లీశ్వరి యు.ఎలియాజరు గారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా అభినందించారు.