google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
178 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కమ్యూనిస్టు చరిత్ర సువర్ణ ఆకారాలతో లిఖించబడిందని ఎం.వెంకయ్య అన్నారు. గత రెండు రోజులు నుండి కందుకూరు పట్టణంలోని స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న సిపిఐ జిల్లా శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవటంలో సిపిఐ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ప్రొఫెసర్ జమీందార్ సమాజం నేటి పరిణామాలు పై మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడీ నుండి దేశం అల్లకల్లోలంలో ఉందని, ప్రచారాలు మాత్రం దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నామని అయితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని త్వరలోనే దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వానికి చరమణగీతం పాడతారని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు అనేక రాష్ట్రాలు తిప్పి కొడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, వైసిపి ప్రభుత్వం సైతం మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దీనిని సిపిఐ గా ఖండిస్తూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు మార్గం చూపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ సిపిఐ పార్టీ నిర్మాణం, కమ్యూనిస్టుల పాత్ర పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన రావాలంటే శిక్షణా తరగతులు అవసరమని ఆయన అన్నారు. ఈ శిక్షణా తరగతులకు కందుకూరులో నిర్వహించిన కందుకూరు సిపిఐ సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర రాజకీయాలలో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలంటే (సిపిఐ) భారత కమ్యూనిస్టు పార్టీ అవసరమని, బిజెపికి మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధిని పక్కదారి పట్టిస్తూ ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని రానున్న కాలంలో ఎదురు కావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.