google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రూ. 12 లక్షలతో ఎస్టీ కాలనీ మంచినీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొండపి నియోజకవర్గం, పాత సింగరాయకొండలో రూ. 68 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలతో కలసి సోమవారం మంత్రి డా.స్వామి ప్రారంభించారు. అనంతరం రూ. 12 లక్షల అంచనా వ్యయంతో ఎస్టీ కాలనీకి మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా.శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావించి పనిచేస్తోందని స్పష్టం చేశారు. రెండేళ్లలోనే కొండపి నియోజకవర్గంలో రూ. 500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
2018 లోనే సింగరాయకొండకు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకువస్తే, గత ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని మండిపడ్డారు. మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ విజ్ఞప్తి మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు రూ. 45 కోట్లతో ఈ పాఠశాలను శాంక్షన్ చేశారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, 'అన్నదాత సుఖీభవ' కింద పెట్టుబడి సాయంగా ఏటా రూ. 20 వేలు అందిస్తున్నామని చెప్పారు. 'తల్లికి వందనం' కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తలా రూ. 13 వేలు అందిస్తున్నామన్నారు. 'స్త్రీ శక్తి', 'దివ్యాంగ శక్తి' పథకాల ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ఎస్సీ, ఎస్టీల గృహాలపై సోలార్ సిస్టమ్స్ బిగిస్తున్నామని మంత్రి స్వామి వివరించారు.
