google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 'స్కై ఐ ప్రకాశం' (Sky Eye Prakasam Project) ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ కోసం డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.డ్రోన్ నిఘా ద్వారా గ్రామాలు, పట్టణాలు మరియు అనుమానాస్పద ప్రాంతాలను పర్యవేక్షిస్తూ బహిరంగ మద్యం సేవించడం, జూదం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడమే 'స్కై ఐ ప్రకాశం' ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో బహిరంగ మద్యం సేవించడం, జూదం లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.