google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం శానంపూడి మరియు బింగినపల్లి గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంటల భీమా నమోదు ఖరీఫ్ 2026-27 కి సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి రైతులకు వివరించడం జరిగింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద వరి, కంది , సజ్జ, ఎండుమిరప ,మినుములు ,నువ్వులు మరియు పంటల భీమా లో భాగంగా పైన తెలిపిన పంటలు ఎంపిక కాబడినవి ఇందులో భాగంగా కంది పం పంటకు ఎకరాకు రైతు వాటా 430 రూపాయలు సజ్జకి 156 రూపాయలు ఎండుమిరపకి 4500 రూపాయలు నిర్ణయించడం జరిగినది పంటల బీమా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేదీలు ప్రత్తికి ఆఖరి తేదీ ఈ నెల జూలై 15వ తేదీ మిగతా అన్నిటికి ఈనెల జూలై 31 ఆఖరి తేదీ వరకి ఆగస్టు 15 ఆఖరి తేదీ లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మరియు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ శారద పాల్గొనడం జరిగినది.