google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణం, కురిచేడు రోడ్‌లోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుపేదలకు కేవలం ₹5కే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనం అందించడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు.ప్రభుత్వం కల్పించిన ఈ సేవను ప్రతి ఒక్కరూ బాధ్యతతో వినియోగించుకోవాలని, భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని నేలపై వేయకుండా చెత్తబుట్టల్లో వేయాలని, అన్నా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిద్దామని పిలుపునిచ్చారు.