google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడిముసిలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి దువ్వూరు పావని గారి భర్త మధు రెడ్డి గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు బుధవారం ఆయనను పరామర్శించారు. మధు రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనల మేరకు చికిత్సను కొనసాగించాలని సూచించారు. ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.