google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజా శాంతి భద్రతలను పరిరక్షించడం, బహిరంగ మద్యపానాన్ని నిరోధించడం మరియు ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు బహిరంగ మద్యపానానికి ఉపయోగిస్తున్న ప్రదేశాలను గుర్తించి, అక్కడ పేరుకుపోయిన మద్యం సీసాలు, గ్లాసులు, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర చెత్తను తొలగించి పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు మరియు వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా ప్రదేశాలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలు ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. బహిరంగ మద్యపానం, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు.ప్రజల సహకారంతో నేరరహిత, పరిశుభ్రమైన మరియు సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని తెలిపారు.