google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రైతు సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి జయంతి బాబు డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు 26వ వేలం కేంద్రం పొగాకు రైతుల సమావేశం విప్పగుంట గ్రామంలో ఉన్నం రమణయ్య అనుములు సురేష్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంతి బాబు గారు మాట్లాడుతూ పుగాకు రైతుల సమస్యల పరిష్కారం కొరకు అనేక దఫాలుగా అధికారులను సమస్యను పరిష్కారం చేయమని విన్నవించుకున్న ఎప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పొగాకు వేలం కేంద్రాల వద్ద నిరసనలు గుంటూరు పొగాకు బోర్డు ఈడి ఆఫీస్ కి రాయబారాలు జిల్లా కేంద్రం కేంద్రంలో ట్రాక్టర్ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు జరిగిన ఎప్పటికీ కూడా పొగాకు రైతుల సమస్యను ప్రభుత్వం పరిష్కారం చేయలేదని అన్నారు భవిష్యత్తులో రైతులందరూ ఐక్యంగా పొగాకు గిట్టుబాటు ధర వచ్చేవరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో 26వ పొగాకు వేలం కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాల రైతులు బోర్డు కమిటీ సభ్యులు ఎస్ఏ గౌస్ పాల్గొన్నారు