google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
వివిధ ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సీఎంఆర్ఎఫ్ ద్వారా అధిక మొత్తంలో వైద్య సహాయాలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి…. అని కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరులోని TDP కార్యాలయంలో గురువారం 111 మంది లబ్ధిదారులకు 78,28,829 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు అందజేశారు. కందుకూరు మండలంలో 30 మందికి 24,83,106 రూపాయలు, ఉలవపాడు మండలంలో 39 మందికి 34,19,413 రూపాయలు,
వలేటివారిపాలెం మండలంలో 42 మందికి 20,72,998 రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 1632 మంది పేదలకు 12.52 కోట్లు సహాయం అందించటం సంతోషంగా ఉందని నాగేశ్వరరావు తెలిపారు. ఆయా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆలోచన తనదని చెప్పారు. పెద్ద సంఖ్యలో చెక్కులు అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, నాయకులతో టిడిపి కార్యాలయంలో సందడి నెలకొంది. ఎప్పుడూ లేనివిధంగా నియోజకవర్గంలో భారీగా వైద్య సహాయాలు అందిస్తున్నారని, ఈ క్రెడిట్ అంతా ఎమ్మెల్యేగారిదేనని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన మేలును మరిచిపోమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, జనిగర్ల నాగరాజు, పూరిమిట్ల గురునాథం, మాదాల లక్ష్మీనరసింహం, రాష్ట్ర కమిటీ నాయకులు షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, నాదెళ్ల వెంకటరమణయ్య, కూనం నరేంద్ర, పార్లమెంట్ కమిటీ నాయకులు షేక్ రూబీ, నేతలు రాయపాటి శ్రీను, షేక్ సలాం, షేక్ మున్నా, చిత్తారు మల్లికార్జున, తన్నీరు కొండలరావు, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు.