google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన కామ్రేడ్ వేజండ్ల హనుమంతరావు సంతాపసభ ఈ రోజు జరిగింది. ఈ సభకి సీపీఎం మండల కన్వీనర్ వి. మోజెస్ అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా సీపీఎం, సిపిఐఎంల్ పార్టీ జిల్లా, మండల, స్థానిక నాయకులు హనుమంతరావు చిత్ర పటానికి పూలు,మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేసారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పొందూరు గ్రామానికి సీపీఎం పార్టీ తరుపున సుదీర్ఘ కాలం( 30 సం,, లు )సర్పంచ్ గా పరిటాల కోటయ్య పనిచేస్తే ఆ పార్టీ కి హనుమంతరావు పొందూరు గ్రామంలో నాయకత్వం వహించారు అని గుర్తు చేశారు, వ్యవసాయ కూలీల సమస్య ల పరిష్కారం కోసం కృషి చేసి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యునిగా మంచి క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా హనుమంతరావు గుర్తింపు పొందారు అని తెలిపారు. .గ్రామ అభివృద్ధి కోసం , సీపీఎం పార్టీ అభివృద్ధి కోసం చనిపోయంతవరకు ఎర్ర జండా ను వదల కుండా పనిచేసిన హనుమంతరావు కి జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమం లో సీపీఎం సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, , పునాటి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎస్కె. మాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. వి. కొండారెడ్డి , కాలం సుబ్బారావు, కేజీ. మస్తాన్,వి. బాలకోటయ్య , టీ. రాము,, వి. సింగయ్య, వి. సుబ్బారావు.సిపిఐ(యంల్ ) పార్టీ జిల్లా కార్యదర్శి డి వి ఎన్. స్వామి, న్యూ డెమోక్రాసి పార్టీ జిల్లా నాయకులు సాగర్
తదితరులు పాల్గొన్నారు ,….