google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన "షైనింగ్ స్టార్స్- 2026" అవార్డులలో కందుకూరు పట్టణానికి చెందిన బి.ఆర్. ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ అవార్డులకు పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికై ఘనత సాధించారు.ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹20,000 (ఇరవై వేల రూపాయలు) నగదు బహుమతి తో పాటు ప్రభుత్వ అధికారిక ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు.ఈ అద్భుత విజయ సాధించిన విద్యార్థులను బి.ఆర్. ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు జి. బాలభాస్కరరావు, బి. నరేంద్రబాబు లు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు గారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు తమ సంస్థ అందిస్తున్న నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్ శిక్షణే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వ అవార్డులకు ఎంపికై పాఠశాల కీర్తిని, కందుకూరు ప్రాంత గౌరవాన్ని పెంచిన విద్యార్థులకు, వారికి సహకరించిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్, ప్రిన్సిపాల్స్,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని విజేతలకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.