google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందిచిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ V.హర్షవర్ధన్ రాజు , ఐపీఎస్.,గారు
క్రైమ్ నెంబర్: 130/2026 U/s 307 BNS of Chimnakurthy PS
స్వాదీనం చేసుకున్న మోటార్ సైకిళ్ళు : 15, వాటి విలువ సుమారు 15,00,000/-
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఫిర్యాది వివరములు: ఇంకొల్లు పోలిరెడ్డి తండ్రి వెంకారెడ్డి (లేట్),72 సంవత్సరాలు, P.నాయుడుపాలెం గ్రామం, చీమకుర్తి మండలం ముద్దాయిల వివరములు:
దేవరకొండ దినేష్ కుమార్ తండ్రి పేరు: నాగరాజు, వయస్సు: 23 సంవత్సరాలు, కొలచనకోట గ్రామం,మద్దిపాడు మండలం
కలుపుకురి శరత్ బాబు తండ్రి పేరు: నాగేశ్వరావు, వయస్సు: 20 సంవత్సరాలు, గ్రామం: కొప్పెరపాడు గ్రామం, బల్లికురవ మండలం.
చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు కేసు వివరములు: ది 11.07.26 న పిర్యాది దారుడు అయిన ఇంకొల్లు పోలిరెడ్డి తండ్రి వెంకారెడ్డి (లేట్),72 సంవత్సరాలు, P.నాయుడుపాలెం గ్రామం, చీమకుర్తి మండలం అనునతను రెండు సం.ల క్రితం AP 40 EL 9788 నెంబర్ గల టీవీఎస్ రేడాన్ మోటార్ సైకిల్ కొనుగోలు చేయగా ఎప్పటిలాగానే తన మోటార్ సైకిల్ ను రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటి ముందు పెట్టి ఇంట్లోకి వెళ్లి పడుకొని నిద్రపోయినట్లు, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు లేచి చూడగా ఇంటి ముందు పెట్టిన బైకు కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వెతుకుతుండగా తన మోటార్ సైకిల్ ను ఉంచిన దగ్గర్లోనే ఒక బలమైన కర్ర మరియు ఇనుప రాడ్డు పెట్టబడి ఉన్నట్లు మరియు ఆ కర్ర, ఇనుపరాడ్డు పిర్యాది కి చెందినవి కావని గమనించి , చుట్టుపక్కల ఎంత వెతికినా తన మోటార్‌సైకిల్ ఆచూకీ లభించనట్లు అంతటా ఎవరో గుర్తు తెలియని దొంగలు అర్ధరాత్రి సమయంలో తన ఇంటి ముందుకు వచ్చి తన మోటార్ సైకిల్ దొంగతనం చేసే క్రమం లో ఫిర్యాది గనుక నిద్రలేచి వస్తే ఆ కర్ర మరియు రాడ్డుతో ఫిర్యాదును గాయపరచాలని ఉద్దేశంతో వాటిని తీసుకొని వచ్చినట్లు , ఫిర్యాది రాకపోయేసరికి తన మోటార్ సైకిల్ ను దొంగలించుకుపోయినట్లు ఫిర్యాదు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా చీమకుర్తి ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు. వాటి విలువ సుమారు రూ.90,000/-లు ఉంటున్నది అని ఇచ్చిన రిపోర్ట్ మేరకు తేది 13.07.2026 న గంటలకు చీమకుర్తి పోలీస్ స్టేషన్ నందు 130/2026 U/s 307 BNS గా కేసు నమోదు కాబడినది. కేసు చేదించిన తీరు: అంతట ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు , ఐపీఎస్.,గారి స్వీయ పర్యవేక్షణలో ఒంగోలు డిఎస్పీ R. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చీమకుర్తి సీఐ D. ప్రసాద్ గారి నేతృత్వంలో చీమకుర్తి ఎస్సై L.సంపత్ కుమార్, మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి, నేరం జరిగిన తీరును బట్టి, లోతైన దర్యాప్తు చేపట్టి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి , ఎప్పటికప్పుడు కేసును రివ్యూ చేస్తూ త్వరితగతిన కేసు దర్యాప్తు చేసి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను తేది 16.07.2026 న ఉదయం 07.30 గంటలకు మంచికలపాడు గ్రామం పోవు క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి వారివద్ద నుండి వివిధ పోలీస్ స్టేషన్ లకు సంభందించిన 15 మోటార్ సైకిళ్ళను ( Maddipadu PS, S.Konda PS, Tangutur PS, Martur PS, Kothapeta PS, Darsi PS, Ballikurava PS) స్వాధీనపరచుకుని పై కేసును చేధించటం జరిగింది. మరియు బండ్లమూడి గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి గుడిలో దొంగతనం ప్రయత్నించిన కేసులో కూడా, స్వాధీనపరచుకున్న మొత్తం మోటార్ సైకిళ్ళ విలువ సుమారు రూ.15,00,000/-లు ఉంటున్నది.
మోటార్ సైకిళ్ళ వివరాలు ,
Bullet -2, Unicorn-5, Pulsar-3, Glamour -2, TVS Radeom-1, Spender Plus-1, Passion plus-1ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసులు , చీమకుర్తి సిఐ D. ప్రసాద్, చీమకుర్తి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ L.సంపత్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది HC-509 K.చిరంజీవి, PC 1062 T. రవి కుమార్, PC 2643 – K సుబ్బారావు, PC- 2644 కే అనిల్, PC-2491 A.V నాయుడు ,HG- 444 P. నారాయణ లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
