google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-
ప్రకాశం జిల్లా కొండేపి మండలం తాటాకులపాలెం గ్రామానికి చెందిన శివకృష్ణ శివపార్వతిల కూతురు లోకేశ్వరి అనే అమ్మాయి ఇంట్లో పనులు చేయట్లేదు అని తల్లి మందలించేసరికి మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, ఈరోజు ఉదయం హైదరాబాద్ లో మేడ్చల్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంది, మేడ్చల్ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు ప్రశాంత్ అనే వ్యక్తి ఆమెను గమనించి మాట్లాడి వివరాలు తెలుసుకుని, జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ గారిని ఫోన్లో సంప్రదించి జరిగినది మొత్తం తెలియజేశారు, కనపర్తి మనోజ్ కుమార్ గారు జనసేన పార్టీ కొండేపి మండలం నాయకుల ద్వారా విచారణ జరిపించారు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం మేడ్చలలో లోకేశ్వరిని వారి మేనమామ అయిన అంకయ్య ఉమాదేవి దంపతులకు ప్రశాంత్ అనే జనసేన పార్టీ నాయకుడు లోకేశ్వరిని వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పచెప్పడం జరిగింది.
లోకేశ్వరి కుటుంబ సభ్యులు మరియు బంధువులు సంతోషంగా ఉన్నారు, నిజాయితీ గల జనసేన పార్టీ నాయకులకు మరియు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.