google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

పేకాట ఆడుతున్న స్థావరంపై జరుగుమల్లి పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు అరెస్ట్, రూ.1,30,200 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం గ్రామ శివారులో తేదీ:16.07.2026న రాత్రి సుమారు 10 గంటల సమయంలో పేకాట స్ధావరంపై జరుగుమల్లి ఎస్సై భాగ్యరాజు మరియు వారి సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 7 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.1,30,200 నగదు, 7 మొబైల్ ఫోన్లు మరియు 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసినారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.