google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో ద్విచక్ర, త్రిచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలను పరిశీలిస్తూ వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ (PUC) ధృవపత్రాలను తనిఖీ చేశారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అధిక వేగం, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.