
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు అత్యాధునిక బ్రీత్ అనలైజర్ (Breath Analyzer) పరికరాలతో పరీక్షలు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాంటి వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.అదేవిధంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించిన అనంతరం వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు అమూల్యమైనవని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండి సురక్షితమైన ప్రయాణాన్ని అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.