
తొలి శుభోదయం న్యూస్ కలిగిరి:-
కలిగిరి పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్గా సయ్యద్ లతీఫున్నిసా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గత 2 సంవత్సరాలుగా జలదంకి ఎస్సైగా విధులు నిర్వహించిన సయ్యద్ లతీఫున్నిసా కలిగిరి పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు..
జలదంకి మండలంలో విధులు నిర్వహించిన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చి, నిబద్ధతతో సేవలందించిన అధికారిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, చట్టం ముందు అందరికీ సమాన న్యాయం జరిగేలా పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సయ్యద్ లతీ ఫున్నిసా పేర్కొన్నారు..