
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి.
ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలి.సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల బాల బాలికలకు ఆదివారం మెటీరియల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హాస్టల్లో అందుతున్న సదుపాయాలు, చదువుకునే వాతావరణం, భోజన వసతి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నాను. అనంతరం విద్యార్థినులకు ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్షీట్లు, కార్పెట్లు, టర్కీ టవళ్లు, స్వెట్టర్లు, నైట్ డ్రస్సులు, షూలు, సాక్సులను అందజేశాను.