
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలులోని జీజీహెచ్ (GGH) ఆడిటోరియంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ నిర్వహించిన "షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2026" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజా బాబు గారు మరియు శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ. బి. ఎన్. విజయ్ కుమార్ గారు.ఈ సందర్భంగా 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారికి అవార్డులు అందించిన సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.