
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
ప్రకాశం జిల్లా గుడ్లూరు సర్కిల్ ప్రాంతంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ D. రమేష్ బాబు గారిని గుడ్లూరు కు చెందిన నేత్రపురి శ్రీరామ సేవక్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి,తమను తాము పరిచయం చేసుకొని గుడ్లురు లో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గురించి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వివరించారు.ఆ తదుపరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారిని శాలువాతో సత్కరించి వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేత్రపురి శ్రీరామసేవక్ నిర్వాహకులు ఎయిర్టెల్ చిన్న, ఇన్నమూరి. ప్రమీల సుధాకర్, గొల్ల అచ్యుతమణి, గుర్రం శ్రీహరి కృష్ణ ఇన్నమూరి గరటయ్య తదితరులు పాల్గొన్నారు.