
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 'స్కై ఐ ప్రకాశం' (Sky Eye Prakasam) ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం అత్యాధునిక డ్రోన్ సాంకేతికతతో ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.జిల్లాలో ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, బహిరంగ మద్యపానం మరియు జూదం జరిగే అవకాశమున్న ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ ద్వారా అనుమానాస్పద కదలికలను గుర్తించి, వెంటనే సంబంధిత పోలీసు బృందాలు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టారు.బహిరంగ మద్యపానం, జూదం మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఇలాంటి కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే డయల్ 112 లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.