
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన కార్యాలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం… అర్జీదారులతో కిటకిటలాడుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అర్జీలరూపంలో తమ సమస్యలను ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నారు. రెవిన్యూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, గ్రామాలలో మౌలిక వసతులు, ఇంకా పలు సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే గారిని కలుస్తున్నారు. గ్రామాల్లో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ… అధికారులకు వెంటనే ఫోన్ చేసి అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశిస్తున్నారు. అలాగే రికార్డుల పరంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపైనా యంత్రాంగానికి సూచనలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో అడ్డంకిగా మారుతున్న టెక్నికల్ కష్టాలు కూడా వెంటనే తీరుతున్నాయి.ముందు తాము చెప్పిన సమస్యను సావధానంగా వినడం, పూర్తి వివరాలు తెలుసుకోవడం, తద్వారా సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు చొరవ తీసుకుంటున్న విధానం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నిర్లక్ష్యం వహించే అధికారులను హెచ్చరిస్తూ… మరోవైపు సామాన్య ప్రజల ఇబ్బందులు తొలిగేలా యంత్రాంగాన్ని నడిపిస్తున్న తీరుపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.గత పాలకుల ఆలోచనలు, పరిపాలనకు భిన్నంగా… ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడి, సాధక బాధలు తెలుసుకోవడం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి అలవాటుగా మారింది. దీంతో అర్జీతో ఆఫీసుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ, పూర్తి సంతృప్తితో తిరిగి వెళుతున్నారు. ఏ సమస్య అయినా సరే, ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే… తప్పక పరిష్కారం అవుతుందన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతుండడం…. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి చిత్తశుద్ధి అంకితభావానికి నిదర్శనంగా చర్చ నడుస్తోంది.