
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరులోని ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ యం. శివకుమార్ అధ్యక్షతన గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్లోబల్ హ్యూమన్ రైట్స్ యాంటి కరప్షన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాగులూరి శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ
విద్యార్థులు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండి నిజాయితీ, నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కుటుంబం, గ్రామం, సమాజం మరియు దేశ అభివృద్ధికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని, ముఖ్యంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఏ వస్తువు కొనుగోలు చేసినా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని విద్యార్థినులకు అవగాహన కల్పించారు ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ యం. శివకుమార్ ఉపాధ్యాయులు మాగులూరి శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువప్రగతి పధం స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షుడు ఫరుక్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.